ENGLISH

బిగ్ బాస్‌ ఓటీటీ.. వీళ్లంతా ఫిక్సేనా?

07 February 2022-10:00 AM

బుల్లి తెర‌పై బిగ్ బాస్ ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టి వ‌ర‌కూ 5 సీజ‌న్లు దిగ్విజ‌యంగా పూర్త‌య్యాయి. ఇప్పుడు బిగ్ బాస్ మ‌రో ముంద‌డ‌గు వేసింది. ఓటీటీలో బిగ్ బాస్ ప్ర‌సారంకానుంది.

 

ఇక‌పై 24 గంట‌లూ బిగ్ బాస్ హౌస్‌లో ఏం జ‌రుగుతోందో ఓ కంట క‌నిపెట్ట‌వ‌చ్చు. డిస్నీ హాట్ స్టార్‌లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 27 నుంచి ఓటీటీ బిగ్ బాస్ ప్ర‌సారం కానుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ ఈవెంట్ చేయ‌బోతున్నార్ట‌. ఇప్ప‌టికే... కంటెస్టెంట్ల ఎంపిక జ‌రిగిపోయింద‌ని టాక్‌. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, దుర్గారావు, సాఫ్ట్ వేర్... ఇలా కొంత‌మంది పేర్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం వీళ్లంతా క్వారెంటైన్‌లో ఉన్నార‌ని స‌మాచారం అందుతోంది. ఈనెల రెండో వారంలో ప్ర‌మోష‌న్ ఈవెంట్ ఒక‌టి చేయ‌బోతోంది డిస్నీ హాట్ స్టార్‌. దీనికి నాగార్జున రాబోతున్నాడు. ఆ స‌మ‌యంలోనే... ఓటీటీ బిగ్ బాస్ గురించిన మ‌రికొన్ని విష‌యాలు తెలుస్తాయి. బిగ్ బాస్ లో గెలిచిన వాళ్ల‌కు 50 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ ఇస్తారు. మ‌రి ఇది ఓటీటీ బిగ్ బాస్ క‌దా... ఎంత ఇస్తారో చూడాలి.

ALSO READ: మూగబోయిన గానకోకిల.. లతాజీ ఇక లేరు