ENGLISH

నిర్మాత‌ల్ని భ‌య‌పెడుతున్న విల‌న్‌

07 February 2022-10:45 AM

అటు ద‌ర్శ‌కుడిగా, ఇటు న‌టుడిగా రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తున్న వాళ్ల‌లో ఎస్‌.జె.సూర్య ఒక‌డు. ఆ మాట‌కొస్తే ఈమ‌ధ్య న‌టుడిగానే ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. బ‌డా స్టార్ సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు ఆయ‌న్ని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ఈమ‌ధ్య `మానాడు`లో శింబుకి విల‌న్ గా చేశాడు.ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. సూర్య వ‌ల్లే. ఆ సినిమాకి అంత మైలేజీ వ‌చ్చింద‌ని త‌మిళ వాసులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ కూడా చేయ‌బోతున్నారు.

 

`మానాడు` ఎప్పుడైతే హిట్ట‌య్యిందో, అప్పుడో త‌న రెమ్యున‌రేష‌న్ ని పెంచేశాడు సూర్య‌. ఇటీవ‌ల టాలీవుడ్ నుంచి ఓ నిర్మాత వెళ్లి డేట్లు అడిగితే రూ.7 కోట్ల పారితోషికం అడిగాడ‌ట‌. ఏడు కోట్లంటే సూర్య‌కు మ‌రీ ఎక్కువ‌. ఇది వ‌ర‌కు `స్పైడ‌ర్‌`లో త‌ను విల‌న్ గా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత‌.. తెలుగు నుంచి త‌న‌కేం ఆఫ‌ర్లు రాలేదు. ఒక్క హిట్టుతోనే ఇలా పారితోషికం పెంచేయ‌డంతో నిర్మాతలు సూర్య పేరు చెబితేనే ఇప్పుడు భ‌య‌ప‌డుతున్నారు.

ALSO READ: బిగ్ బాస్‌ ఓటీటీ.. వీళ్లంతా ఫిక్సేనా?