ENGLISH

ఇద్ద‌రు హీరోయిన్లకీ లిప్పులాకులు ఇచ్చేసిన ర‌వితేజ‌

07 February 2022-11:47 AM

క్రాక్ హిట్టుతో సూప‌ర్ ఫామ్ లోకి వ‌చ్చేశాడు ర‌వితేజ‌. ఇప్పుడు త‌న చేతిలో బోలెడు సినిమాలున్నాయి. ఈనెల 11న ఖిలాడీ విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. టీజ‌ర్‌, పాట‌లు.. ఆక‌ట్టుకుంటున్నాయి. ట్రైల‌ర్ నేడో, రేపో విడుద‌ల చేస్తారు. ఈ సినిమాలో అన్ని అంశాల్ని బాగా మిక్స్ చేశామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. దానికి తోడు... ఈ సినిమాలో రెండు హాట్ హాట్ లిప్ లాకులు ఉన్నాయ‌ట‌.

 

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి క‌థానాయిక‌లుగా న‌టించారు. ఒక్కో హీరోయిన్ తో ఒక్కో లిప్ లాక్ సీన్ చేశాడ‌ట ర‌వితేజ‌. అలా.. ఇద్ద‌రు హీరోయిన్ల పాత్ర‌ల‌కూ స‌మ న్యాయం చేసిన‌ట్టైంది. అయినా.. ఈమ‌ధ్య సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాలు, లిప్ లాకులూ క‌మ‌న్ అయిపోయాయి. ర‌వితేజ లిప్ లాకులు చేయ‌డం మాత్రం అరుదు. అలాంటిది.. ఒకే సినిమాలో రెండు లిప్పులాకులు అంటే... విచిత్ర‌మే. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు.

ALSO READ: బిగ్ బాస్‌ ఓటీటీ.. వీళ్లంతా ఫిక్సేనా?