ENGLISH

ట్రైలర్: మాస్ మహారాజా మార్క్ 'ఖిలాడీ'

07 February 2022-18:35 PM

''ఎప్పుడూ ఒకే టీంకి ఆడటానికి నేషనల్ ప్లేయర్ ని కాదు ఐపియల్ ప్లేయర్ ని . ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను'' అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకుడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమా ట్రైలర్‌ బయటికి వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే పక్కా రవితేజ మార్క్ సినిమా అనిపిస్తుంది.

 

ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్, యాక్షన్ ఆకట్టుకుంది. రోమాన్స్ కూడా బాగానే దట్టించారు. ట్రైలర్ లో అనసూయకి కూడా చోటిచ్చారు. అనసూయ, రవితేజల మధ్య వినిపించిన ''దూరం దూరం మాది మడీ ఆచారం. దగ్గరదగ్గర ఇది మా ఆచారం'' డైలాగు నవ్వులుపూయించింది. డబ్బు చుట్టూ తిరిగే కథ ఖిలాడీ అని ట్రైలర్ లో చూస్తే అర్ధమౌతుంది. అర్జున్‌ సీరియస్ విలన్ గా కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బావుంది. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ALSO READ: ఇద్ద‌రు హీరోయిన్లకీ లిప్పులాకులు ఇచ్చేసిన ర‌వితేజ‌