ENGLISH

లోకేష్ కనక రాజ్ తో నాని?

28 October 2024-21:56 PM

ప్రజంట్ కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగుతోంది. తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనక రాజ్. 'మా న‌గ‌రం' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ 'ఖైదీ' సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. కార్తీ హీరోగా తెరకెక్కించిన ఖైదీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మూవీస్ లో ఫస్ట్ ది ఖైదీ.  యూనివర్స్‌ లని సౌత్ లో మొదట పరిచయం చేసింది లోకేష్ కావటమే గమనార్హం. ఖైదీ కథకు కొనసాగింపుగా విక్రమ్‌, లియో సినిమాలు తెరకెక్కించి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. దీనితో లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై మరింత ఆసక్తి పెరిగింది.

లోకేష్ ప్రజంట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'కూలీ' మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. శృతి హాసన్ రజనీ కూతురిగా నటిస్తున్నట్టు సమాచారం. గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ 50 పర్శంట్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. కూలీ మూవీ తర్వాత లోకేష్ 'ఖైదీ' సీక్వెల్ చేయనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటివరకు వచ్చిన లోకేష్ సినిమాలు ఒక ఎత్తు అయితే రాబోయే సినిమా మరొక ఎత్తు అని తెలుస్తోంది. కార్తీతో పాటు సూర్య కూడా ఖైదీ 2 లో నటిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ అయ్యింది.

ఖైదీ మూవీ రిలీజ్ అయ్యి ఐదేళ్లు కంప్లీట్ అవటంతో ఢిల్లీ, నేను మళ్లీ రాబోతున్నాం అని ట్వీట్ చేశారు లోకేష్. త్వరలో ఖైదీ 2 స్టార్ట్ అవనున్నట్లు హింట్ ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లోకేష్ కనక రాజ్ యూనివర్స్ లో టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని కూడా చేరినట్లు సమాచారం. ఖైదీ 2 లో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. లోకేష్ లాంటి పాన్ ఇండియా దర్శకుడి సినిమాలో నాని నటిస్తున్నాడన గానే ఫాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ ఆఫర్ మరింత తోడ్పడుతుంది.