ENGLISH

ఈ ల‌వ్ స్టోరీకి భ‌లే రేటొచ్చింది.

03 June 2020-14:00 PM

ఈ రోజుల్లో థియేట‌రిక‌ల్ రైట్స్ ఎంత కీల‌క‌మో, శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ కూడా అంతే కీల‌కం. కేవ‌లం థియేట‌ర్ నుంచి వ‌చ్చిన డ‌బ్బుల‌తో నిర్మాత గ‌ట్టెక్క‌డం లేదు. వేణ్నీళ్ల‌కు చ‌న్నీళ్లు సాయం అన్న‌ట్టు శాటిలైట్‌, డిజిట‌ల్ కూడా కావ‌ల్సిందే. కొన్ని సినిమాల‌కు స‌గం పెట్టుబ‌డి ఈ రెండింటి నుంచే వ‌చ్చేస్తోంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ల‌వ్ స్టోరీ`. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు.

 

ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ క్లోజ్ అయ్యాయి. ఈ రెండూ క‌లిపి దాదాపుగా 11 కోట్లు ప‌లికాయ‌ని టాక్. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.25 కోట్లు. అంటే అటూ ఇటుగా స‌గం డ‌బ్బులు డిజిట‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేసిన‌ట్టే. మ‌ల్టీప్లెక్సుల్లో, ఏ సెంట‌ర్ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఓవ‌ర్సీస్‌లోనూ అంతే. ఏ రూపంలో చూసినా ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ ప్రాజెక్ట్ అనుకోవాలి.

ALSO READ: ఎన్టీఆర్ ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ హీరోయిన్‌!