ఈ సంక్రాంతికి పోటీ మామూలుగా ఉండబోవడం లేదు. జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ వస్తోంది. ఆ తరవాత భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వచ్చేస్తాయి. బంగార్రాజు కూడా ఈ సంక్రాంతికే విడుదల అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. అయితే ఆర్.ఆర్.ఆర్, భీమ్లాలతో పోలిస్తే... రాధే శ్యామ్ కి బజ్ లేకుండా పోయింది. ఎన్ని పాటలు, కొత్త స్టిల్స్ వస్తున్నా, వాటి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. సుదీర్ఘ కాలంగా ఈ సినిమా సెట్స్‌పై ఉండడంతో హైప్ తగ్గిపోయింది.
ఓరకంగా....ఇది తమకు కలిసొస్తుందని చిత్రబృందం ఓ రకమైన నమ్మకంతో ఉంది. సాహోకి విపరీతమైన హైప్ వచ్చింది. సినిమా బాగానేఉన్నా, అది సరిపోలేదు. దాంతో నెగిటీవ్ కామెంట్లు మొదలయ్యాయి. ఈ ప్రమాదం రాధే శ్యామ్ కి లేదు. ఎందుకంటే ఎలాగూ ఈ సినిమాపై అంచనాలు లేవు. కాస్త అటూ ఇటుగా ఉన్నా జనం చూసేస్తారు. అదే తమకు ప్లస్ పాయింట్ అవుతుందన్నది నిర్మాతల నమ్మకం. ఈనెల 23న హైదరాబాద్ లో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ట్రైలర్ కూడా విడుదల అవుతుంది. ఆ తరవాతైనా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారేమో చూడాలి.
ALSO READ: బన్నీ కోసం రూటు మారుస్తున్న బోయపాటి