ENGLISH

తమిళ రచయత రాసిన తెలుగు పాట

18 August 2017-20:01 PM

ప్రముఖ తమిళ రచయత అయిన మదన కార్కీ మనవారికి బాహుబలి చిత్రంలో వచ్చే కిలికిలి భాష రూపకర్త ఈయనే. తమిళ సినీపరిశ్రమలో మంచి రచయతగా పేరుపొందిన ఈ యంగ్ రైటర్ ఇప్పుడు తెలుగులో అడుగుపెట్టాడు.

మహేష్ హీరోగా వస్తున్న స్పైడర్ చిత్రంలో ఒక తెలుగు పాటని ఈయన రాసినట్టు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఒక తమిళ రైటర్ గా కొనసాగుతూ తెలుగు పాత రాయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం.

హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆల్బం త్వరలోనే విడుదల కానుంది. స్పైడర్ చిత్రం హీరో మహేష్ కి తమిళంలో మొదటి స్ట్రెయిట్ చిత్రం కానుంది, ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్