ENGLISH

కొల్లగొట్టేసింది, ఇకపై భయపెట్టేస్తుందేమో

18 August 2017-19:15 PM

ఒకే ఒక్క తెలుగు సినిమా చేసి, తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది మలయాళ బ్యూటీ సాయిపల్లవి. భానుమతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సాయిపల్లవి, తన నటనకు అంతా ఫిదా అయ్యేలా చేసుకోగలిగింది. తొలి చిత్రంతోనే సాయి పల్లవి రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయిందనడం నిస్సందేహం. ఈ భామ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. అంతేనా ఇదే స్పీడ్‌లో ఓ థ్రిల్లర్‌ మూవీకి కూడా కమిట్‌ అయ్యిందట. సాయి పల్లవి ఫేస్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్‌ అయినా పలికేస్తుంది. భయపెట్టే ఎక్స్‌ప్రెషన్‌ అయినాసరే. ఆమె కళ్ళు ఆమెకు పెద్ద ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే సాయిపల్లవి చేయబోయే ఆ హర్రర్‌ మూవీకి సంబంధించిన వివరాలు తెలుస్తాయట. ఇదిలా ఉండగా సాయిపల్లవి నాని హీరోగా రూపొందుతోన్న 'ఎంసిఎ' సినిమాలో నటించబోతోంది. ఇది కాకుండా నాగశౌర్యతో ఓ సినిమా కూడా చేయనుంది సాయిపల్లవి. స్టార్‌ హీరోలూ సాయిపల్లవితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారట. అయితే నంబర్‌ కౌంటింగ్‌ తనకిష్టం ఉండదనీ, ఎంత మంచి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యానన్నదే తనకు ముఖ్యమని సాయిపల్లవి క్యూట్‌ క్యూట్‌గా చెప్పేస్తోంది. మోడ్రన్‌గా కన్పించడం వరకూ ఓకే, అలాగని వల్గర్‌గా కన్పించేలా ఎక్స్‌పోజింగ్‌ చెయ్యమంటే అది తనవల్ల కాదని సాయిపల్లవి తేల్చేసింది.

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్