ENGLISH

ఫిట్‌నెస్‌ గురించి మన్మథుడే చెప్పాలి

18 August 2017-19:13 PM

తెలుగు సినీ పరిశ్రమలో వయసు మీద పడ్తున్నా ఫిజిక్‌ని పెర్‌ఫెక్ట్‌గా మెయిన్‌టెయిన్‌ చేస్తున్న హీరో ఎవరన్నా ఉంటే అది 'కింగ్‌' నాగార్జున మాత్రమే. నాగార్జున అంటే మన్మథుడు. తెలుగు సినిమాకి మన్మథుడు నాగార్జునే. ఇప్పటితరం యంగ్‌ హీరోయిన్లు, నాగార్జున కుమారులైన అఖిల్‌, నాగచైతన్యకంటే పెర్‌ఫెక్ట్‌గా నాగ్‌ పక్కన సూటయిపోతారు. అదీ నాగ్‌ స్పెషాలిటీ. నాగ్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసిన బ్యూటీ లావణ్య త్రిపాఠి, నాగ్‌ తనయుడు నాగచైతన్యతో 'యుద్ధంశరణం' సినిమాలో నటిస్తోంది తెలుసు కదా! స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఆనందమే ఆరోగ్యమని నమ్మే వ్యక్తి. బైపాస్‌ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఎక్కువ కాలం జీవించింది ఆయనే. మంచి ఆహారం తీసుకోవడం, ఆనందంగా ఉండడమే తన జీవిత రహస్యమనేవారాయన. నాగార్జున కూడా అంతే. ఇన్నేళ్ళ కెరీర్‌లో నాగ్‌ ఫిజిక్‌లో వచ్చిన పెద్ద మార్పులేమీ కనిపించవు. ఈ వయసులో కూడా సిక్స్‌ ప్యాక్‌ చేసేంత సత్తా నాగార్జున సొంతం. అందుకే ఆయన ఫిట్‌నెస్‌ గురించి ఏం చెప్పినా అది వాస్తవమే అవుతుంది. హైద్రాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున ఫిట్‌నెస్‌ గురించి పాఠాలు చెబుతోంటే అచ్చం ఫిట్‌నెస్‌ ట్రైనరో, డాక్టరో చెబుతున్నట్లే అనిపించింది విన్నవారికి. రోజూ వ్యాయామం చేస్తే నాగార్జునలా ఎప్పటికీ ఫిట్‌గా ఉండవచ్చుననే సంకేతాలు జనంలోకి వెళ్ళాయి. దటీజ్‌ నాగార్జున. ఆయన ఫిట్‌నెస్‌ గురించి ఏం చెప్పినా అది నిజమే అవుతుంది.

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్