ENGLISH

లక్కు అంటే తాప్సీదేనండీ

18 August 2017-19:09 PM

బాలీవుడ్‌లో అయినా టాలీవుడ్‌లో అయినా తాప్సీకి లక్కు భలేగా కలిసొచ్చేస్తోంది. 'ఘాజీ' సినిమాలో తాప్సీ చేసిందేమీ లేదు. కానీ ఆ సినిమా విజయం ఆమె ఖాతాలోకి కూడా వెళ్ళింది. 'నామ్‌ షబానా' సినిమాకి క్రియేట్‌ అయిన హైప్‌ అందరికీ తెలుసు. సినిమా సోసో అనిపించినా తాప్సీకి మంచి పేరొచ్చింది. బాలీవుడ్‌లో తాప్సీ ప్రయాణం ఇప్పుడు చాలా స్పీడ్‌గా ఉంది. ఈ టైమ్‌లో తెలుగులోనూ తాప్సీకి ఓ మంచి సక్సెస్‌ దొరికినట్టే ఉంది. తాజాగా తాప్సీ తెలుగులో నటించిన 'ఆనందోబ్రహ్మ' సినిమాకి ఫస్ట్‌ డే మంచి రిపోర్ట్స్‌ రావడం గమనించదగ్గ అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 'ఆనందోబ్రహ్మ' సినిమాలో తాప్సీ కంటే ఇతర తారాగణానికి ఎక్కువ స్కోప్‌ ఇచ్చాడు దర్శకుడు. కొత్త కాన్సెప్ట్‌ కావడంతో సినిమాకి ప్రీ రిలీజ్‌ హైప్‌ బాగా క్రియేట్‌ అయ్యింది. విడుదలయ్యాక మంచి టాక్‌ రావడం, సినిమా సక్సెస్‌ని ముందే ఊహించి పబ్లిసిటీ పరంగా తాప్సీ ఎక్కువ ఇంట్రెస్ట్‌ పెట్టడం ఇవన్నీ ఆమెకు బాగా కలిసొచ్చాయని చెప్పక తప్పదు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఒక్క రోజే కనిపించినా తాప్సీకి అలా కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఏదేమైనా తాప్సీ పట్టిందల్లా బంగారమే అవుతోందని సినీ జనాలంటున్నారు. ఓ హీరోయిన్‌కి ఇంత పాజిటివ్‌ టాక్‌ రావడం ఆశ్చర్యకరమే. ఇదివరకటిలా కాదు, అప్పుడంటే తాప్సీ ఏది పట్టుకున్నా తేడాకొట్టేసేది. ఇప్పుడు తాప్సీ చుట్టూ లక్కు వైఫైలా తిరుగుతోంది.

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్