ENGLISH

సైలెంట్‌ కిల్లర్‌ మెహరీన్‌

18 August 2017-17:33 PM

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌. చేసింది ఒక్క సినిమానే అది కూడా ఎప్పుడో పాత బడిపోయింది. కానీ ఇకపై ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ ఫోటోనే దర్శనమిచ్చేలా ఉంది. ఆమె చేతిలో ఎన్ని సినిమాలున్నాయో బహుశా ఆమె కౌంట్‌కే రాకపోవచ్చు. అన్ని సినిమాల్లో నటించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సైలెంట్‌గా ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్న ఈ ఆఫర్స్‌లో కొన్ని ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. వాటిలో త్వరలోనే కొన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి కూడా. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'జవాన్‌'లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రవితేజ 'రాజా ది గ్రేట్‌'లోనూ ఈ బ్యూటీనే హీరోయిన్‌. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటన్నింటికన్నా ముందుగా శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'మహానుభావుడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. ఇవి కాక చాలానే ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయట. అరె భలే ఉందే ఈ ముద్దుగుమ్మ క్యూట్‌గా, యాక్టింగ్‌ కూడా సూపర్బ్‌గా చేసిందే.. అనుకున్నారు తొలి సినిమాలో. కానీ ఆ తర్వాత మెహరీన్‌ పేరు ఎక్కడా వినిపించలేదు. దాంతో అమ్మడికి అవకాశాలు లేవనుకున్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఈ బ్యూటీ బాలీవుడ్‌ని కూడా చక్కబెట్టేసింది. బాలీవుడ్‌లో 'ఫిలౌరీ' సినిమాలో నటించింది ఈ భామ. ఆ తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌ని దున్నేయడానికి దూసుకొచ్చేస్తోంది. గెట్‌ రెడీ ఫర్‌ ది బ్యూటీ మెహరీన్స్‌ ఎటాక్‌.

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్