చిన్న పిల్లాడిపై కూడా ఆ సినిమా ప్రభావం ఉందంటే, 'బాహుబలి' సినిమా ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే అందులోని ప్రతీ పాత్ర జనానికి సుపరిచితమే. ఇది వెండితెరకి సంబంధించిన విషయం. అలాంటి పాపులర్ పాత్రలు బుల్లితెరపై సందడి చేస్తే అంతకన్న పండగ మరోటి ఉంటుందా? అదే జరుగుతోందిప్పుడు. బుల్లితెరపై బాహుబలి సీరియల్ రాబోతోంది. 'బాహుబలి' అంటే బాహుబలి కాదండోయ్ సీరియల్ పేరు 'ఆరంభ్'. కానీ పాత్రల పేర్లు మాత్రం 'బాహుబలి' సినిమాలోనివి. హిందీలో రూపొందుతోన్న సీరియల్ ఇది. హీరోయిన్ సోనాలి బింద్రే భర్త గోల్డీ బెహెల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సీరియల్ ఇది. ఈ సీరియల్ గురించిన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సీరియల్‌లో దేవసేనగా ముద్దుగుమ్మ కార్తీక నటిస్తోంది. ఇటీవలే దేవసేన పాత్రలో ఆమె లుక్‌ని రిలీజ్ చేశారు. దేవసేనగా ఎమేజింగ్ లుక్‌లో మెరిసిపోతోంది కార్తీక. ఇప్పుడు తాజాగా శివగామి పాత్ర కోసం మధుబాలను ఎంచుకున్నారట. సీనియర్ నటి మధుబాల హీరోయిన్‌గా గతంలో పలు చిత్రాల్లో నటించింది. ఆకర్షించే అందం, అందానికి తగ్గ అభినయం ఆమె సొంతం. ఈ మధ్యే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాలో హీరోయిన్‌కి తల్లిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 'సూర్య వెర్సస్ సూర్య' సినిమాలో యంగ్ హీరో నిఖిల్‌కి తల్లిగా నటించింది. వయసు పైబడినా అదే ఫిజిక్, అదే అందంతో తల్లి పాత్రలకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది మధుబాల. బుల్లితెరపై నటిస్తున్నందుకు ఈమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనీ తెలుస్తోంది.
ALSO READ: మాట నిలబెట్టుకుంటాం: హరీష్ శంకర్