ENGLISH

మహేష్‌ 'స్పైడర్‌' వచ్చేసింది గురూ!

01 June 2017-11:39 AM

ఓ రోబో సాలీడు, హీరో కాలి బూటు నుంచి భుజం వరకు పాక్కుంటూ వెళుతుంది.హీరో, దాన్ని చూసి 'ష్‌' అంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో అదిరిపోయే మ్యూజిక్‌. ఇదీ 'స్పైడర్‌' టీజర్‌ హంగామా. అభిమానులు ఎదురు చూసినట్లుగానే అదిరిపోయే కిక్‌ ఇచ్చాడు మహేష్‌ తన టీజర్‌తో.మురగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా 'స్పైడర్‌' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఇందులో 'స్పై' కాప్‌గా నటిస్తున్నాడు మహేష్‌బాబు. అందుకే అతని పాత్రను ఎలివేట్‌ చేసేలా టీజర్‌నీ కొత్తగా ప్లాన్‌ చేశారు. చాలా కొత్తగా ఆకట్టుకుంటోంది టీజర్‌. ఫస్ట్‌ లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసుకున్న 'స్పైడర్‌', తాజా టీజర్‌తో ఆ అంచనాలకి ఆకాశమే హద్దు అని ప్రూవ్‌ చేసింది. టీజర్‌లోనే ఇంత క్రియేటివిటీ చూపించిన మురుగదాస్‌ సినిమాలో ఇంకెంత చేసి ఉంటాడో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.మే 31న విడుదలవ్వాల్సిన ఈ టీజర్‌, దాసరి మరణంతో వాయిదా పడి, ఈ రోజు ఉదయం 10.30 నిమిషాల సమయంలో విడుదలయ్యింది. విడుదలైన కాస్సేపటికే ట్రెండింగ్‌ అయ్యింది. సూపర్‌ స్టార్‌ రేంజ్‌కి తగ్గట్టుగానే ఉంది ఈ టీజర్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. రకుల్‌ ఓ వైద్యురాలి పాత్రలో కనిపించనుంది ఈ సినిమాలో. మహేష్‌ ఇంతవరకూ చేయని పవర్‌ ఫుల్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. 'స్పైడర్‌' దసరా కానుకగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: అనుష్క కార్ వాన్ సీజ్‌