ENGLISH

ఈ తొడల గొలేంటి బ్యూటీ!

01 June 2017-11:31 AM

బాలీవుడ్‌ భామ ప్రియాంకా చోప్రా తొడల వివాదం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్రమోడీని విదేశాల్లో కలిసిన ప్రియాంకా చోప్రా ఆ సమయంలో ఓ పొట్టి గౌను వేసుకుని, ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. మోకాళ్ళు కనిపించకుండా డ్రెస్సింగ్‌ చేసుకుని ఉంటే బాగుండేదని, ప్రధానికి గౌరవమిచ్చి ఉండాల్సిందని నెటిజన్లు విమర్శించారు. అయితే వారి విమర్శలు ప్రియాంకా చోప్రాకి రుచించలేదు. నెటిజన్లకు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో తన తల్లితో ఉన్న ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టింది. అందులో ప్రియాంక, ఆమె తల్లి కూడా 'తొడలు' కన్పించే దుస్తుల్లో ఉన్నారు. 'నా జీన్స్‌ ఇవి' అని ప్రియాంక పేర్కొనడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆన్‌ స్క్రీన్‌ ప్రియాంకా పాపులర్‌ బ్యూటీ కావచ్చు. కానీ ఎంత రంగుల ప్రపంచంలో ఉన్నప్పటికీ అది కూడా ఇండియాలోనే ఉంది కదా. ఆమె ఇండియన్‌ మహిళ అనే విషయాన్ని మర్చిపోయిందా ఏంటి. దేశ ప్రధాన మంత్రి ముందు ఎంత గౌరవంగానో వ్యవహరించాలి కదా. మాటకి మాటగా డ్రస్సుతో సమాధానం చెప్పడం కాదు. సినీ నటిగా ఆమెని అందరూ అభిమానించవచ్చు. కానీ దేశ ప్రధానిగా మెడీని గౌరవించాల్సిన బాధ్యత దేశ పౌరురాలిగా ఆమెకుందన్న సంగతి ప్రియాంక తెలుసుకోవాలి కదా. హాలీవుడ్‌కి వెళ్లాక హుందాతనాన్ని పూర్తిగా ప్రియాంక కోల్పోయిందని నెటిజన్లు భావిస్తున్నారు. 

ALSO READ: అనుష్క కార్ వాన్ సీజ్‌