ENGLISH

మ‌హేష్‌బాబు సినిమా - సీతారామ‌పురం

13 September 2020-12:22 PM

ఫ్యాన్స్ చాలా ఫాస్టుగా ఉన్నారిప్పుడు. త‌మ అభిమాన క‌థానాయ‌కుడి సినిమా మొద‌ల‌వుతోందంటే... కాంబినేష‌న్‌ని బ‌ట్టి, ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేసేస్తున్నారు. టైటిళ్లూ పెట్టేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ల‌కు కొద‌వే లేదు. అలాంటి పోస్ట‌ర్ ఒక‌టి ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా మొద‌ల‌వుతుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ చిత్రాన్ని హారిక‌, హాసిని సంస్థ నిర్మించ‌నుంద‌ని చెబుతున్నారు. అయితే ఈ కాంబోపై ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. అటు మ‌హేష్ గానీ, ఇటు త్రివిక్ర‌మ్ గానీ నోరు మెద‌ప‌డం లేదు. హారిక హాసిని సంస్థ కూడా ఏం చెప్ప‌లేదు. కాక‌పోతే.. ఫ్యాన్స్ జోష్ మొద‌లైపోయింది.

 

ఇప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు వ‌దిలేస్తున్నారు. అందులో ఒక‌టి... మ‌హేష్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. సీతారామ‌పురం అనే పేరుతో ఓ పోస్ట‌ర్ వ‌దిలారు ఎవ‌రో. విదేశాలు వ‌దిలి, ప‌ల్లెటూరుకొచ్చిన ఓ హీరో క‌థ అంటూ.. పోస్ట‌ర్‌లోనే క‌థంతా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. నిజంగానే ఇది చిత్ర‌బృందం అధికారికంగా వ‌దిలిన పోస్ట‌ర్‌లానే ఉంది. అది చూసి నిజం పోస్ట‌రేమో అని ఫ్యాన్స్ కూడా న‌మ్మేస్తున్నారు. ఇలాంటి పోస్ట‌ర్లు ఇంకెన్ని చూడాలో?

ALSO READ: త‌స్మాత్ జాగ్ర‌త్త అంటున్న రౌడీ!