మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప' షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది అని సమాచారం. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు, విష్ణు నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కన్నప్ప లో స్టార్ క్యాస్టింగ్ ఉంది. పాన్ ఇండియా మూవీ కావటంతో దాదాపు అన్ని భాషల స్టార్స్ ఇందులో భాగం అవుతున్నారు. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కొడుకు అవరామ్, ఇద్దరు కూతర్లు నటిస్తున్నారు. వీరి తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్,మోహన్ లాల్, నయన్ తార, కాజల్ , లాంటి స్టార్స్ కూడా కన్నప్పలో కొన్ని ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇంత స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ మూవీలో మంచు లక్ష్మి, మనోజ్, లేకపోవటం గమనార్హం.
పాన్ ఇండియా సినిమా కావటం, రిలీజ్ డేట్ కూడా వచ్చేయటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీమ్. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు. మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు కానీ తెలుగులో ఇప్పటివరకు కన్నప్ప ప్రమోషన్స్ ఊసే లేదు. అంతే కాదు ఇక ముందు కూడా ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ నిర్వహించే ఆలోచనలో లేరట. కారణం ప్రెస్ మీట్స్ లో మీడియా నుంచి ప్రశ్నలు ఫేస్ చేయలేక విష్ణు ఇలా ఎస్కెప్ అవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే కేరళ, ముంబై లలో ప్రెస్ మీట్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదంతో రోడ్డెక్కింది. మొదట హైద్రాబాద్, తర్వాత తిరుపతిలో మనోజ్ ,విష్ణు , మోహన్ బాబు వివాదాలు చెలరేగాయి. ఇంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. నెక్స్ట్ సోషల్ మీడియా వేదికగా కూడా మనోజ్, విష్ణు ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఇవే ప్రశ్నలు ఎదురవుతాయని విష్ణు బయపడుతున్నాడు. కన్నప్ప రిలీజ్ ముందు ఏపీ, హైదరాబాద్ లో కేవలం రెండు ఈవెంట్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. డిజిటల్ ప్రమోషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలతోనే కన్నప్పని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నాడట విష్ణు.