ENGLISH

నాగ్ హీరోయిన్... రావు రమేష్ కి జోడీగా

09 May 2024-16:50 PM

టాలీవుడ్ హీరోయిన్ అన్షు అంటే తెలియకపోవచ్చు  కానీ మన్మథుడు హీరోయిన్ అన్షు అంటే తెలియని వారు ఉండరు. నాగార్జునతో కలిసి మొదటిసారి 'మన్మథుడు' లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెక్స్ట్ ప్రభాస్ తో 'రాఘవేంద్ర' అనే సినిమా చేసింది. ఈ రెండు మూవీస్ అన్షు కి కావాల్సిన ఫేమ్ తెచ్చిపెట్టినా. తరవాత సినిమాలకి గుడ్ బై చెప్పేసి, పెళ్లి చేసుకుని లండన్లో సెటిల్ అయిపోయింది. అన్షు సినిమాల్లో కనిపించకపోయినా ప్రేక్షకుల్లో ఆమెకి క్రేజ్ మాత్రం తగ్గలేదు. అన్షు కోసం సొషల్మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన అన్షు ఒకటి రెండు ఇంటర్వ్యూ లో మెరిసి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.         


వరుసగా చనిపోయే క్యారెక్టర్స్ రావటం వలన సినిమాలకి బై చెప్పేసినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మళ్ళీ సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్న ఎదురవగా, తాను ఒక సినిమాలో నటిస్తున్నట్టు పేర్కొంది. ఫాన్స్ సంతోష పడే వార్త చెప్తూనే, కొంచెం నిరుత్సాహాపరిచింది. మన్మథుడులో ఎలా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్ మైంటైన్ చేస్తున్న ఈ అమ్మడు, హీరోయిన్గానో, లేదా ఇంకేదో మంచి పాత్రలో కనిపిస్తుంది అనుకుంటున్న తరుణంలో, రావు రమేష్ కి జోడిగా నటించనున్నట్లు సమాచారం. ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వటం, అదీ రావు రమేష్ కి జోడి గా అని తెలిసి, ఆమె ఫాన్స్  ఉస్సురు మంటున్నారు. 


వరస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సందీప్ కిష‌న్ 30వ సినిమా ప్రారంభ‌మైంది. ఈ సినిమాతోనే అన్షు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈమూవీలో రావు రమేష్, అన్షు పాత్రలు చాలా ఇంపార్టెంటు అని, కథలో కీలక పాత్ర కావటంతో అన్షు కూడా, ఓకే చేసినట్టు టాక్ . ఈ మూవీతో మరిన్ని అవకాశాలు వస్తాయని, ధీమాగా ఉంది అన్షు.