ENGLISH

మీనాక్షి లక్ మారనుందా?

21 October 2024-16:36 PM

హాట్ స్టార్ లో వచ్చిన 'అవుట్ ఆఫ్ లవ్' వెబ్ సిరీస్ తో కెరియర్ మొదలు పెట్టిన మీనాక్షి చౌదరి  'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమాలో సుశాంత్ కి జోడిగా నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. ఆఫర్స్ వస్తున్నాయ్ కానీ మంచి గుర్తింపు దొరకటం లేదు. మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ గుంటూరు కారం సినిమాపై చాలా  ఆశలు పెట్టుకుంది, కానీ అది కూడా మీనాక్షికి ఉపయోగపడలేదు సరికదా అసలెందుకు ఇలాంటి పాత్రకి ఒప్పుకుంది అని విమర్శలు వచ్చాయి. తరవాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో 'గోట్' మూవీలో నటించింది. అక్కడే సేమ్ సీన్ రిపీట్. అసలు ఆ పాత్ర మీనాక్షి కాకుండా ఇంకెవరు చేసినా సరిపోతుందని. 


ప్రస్తుతం మీనాక్షి ఒక నెల వ్యవధిలో మూడు సినిమాలతో లక్ పరీక్షించుకొంటోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి కాంబోలో 'లక్కీ భాస్కర్' సినిమా నవంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'మట్కా' సినిమాలో నటించింది. మట్కా కూడా నవంబరు 14 న రానున్నట్లు సమాచారం. విశ్వక్ సేన్ తో 'మెకానిక్ రాకీ' చేయగా అది నవంబర్ 22 న రానుంది. వీటన్నిటిలో మీనాక్షి లీడ్ హీరోయిన్ కావటం విశేషం. ఇలా ఒకేసారి మూడు సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించటానికి రెడీ అయ్యింది మీనాక్షి.  
  

నెక్స్ట్ సంక్రాంతికి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీతో మెరవనుంది. అందం, అభినయం, ఎక్సపోజింగ్ కి వెనకాడని నైజం అన్ని ఉన్నా అమ్మడికి ఇన్నాళ్లు లక్ కలిసి రాలేదు. ఇప్పటివరకు సెకండ్ హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా వస్తోంది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా మీనాక్షి కి మరిన్ని ఆఫర్స్ రావటం ఖాయం అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రజంట్ టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉంది. కుర్ర హీరోలతో పాటు  సీనియర్ హీరోలకి బెస్ట్ ఆప్షన్ మీనాక్షి.