ENGLISH

నాగ్ నన్ను గర్వపడేలా చేశారు : చిరు

05 April 2021-18:25 PM

నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సినిమా మొత్తం చూశాక తన నోటివెంట 'జైహింద్‌' స్లోగన్ వచ్చిందని చెప్పుకొచ్చారు చిరు. వైల్డ్ డాగ్ సినిమాని వీక్షించారు చిరు. తర్వాత యూనిట్ ని ప్రశంసించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు చిరు. ''బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఉరి’ చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు మనమెందుకు చేయలేకపోతున్నామనే భావన నాలో కలిగింది. మిత్రుడు నాగార్జున ఇలాంటి సినిమా చేయడం నాకెంతో గర్వంగా అనిపించింది'' అని చెప్పుకొచ్చారు చిరు.

 

‘‘రెండున్నర గంటలు ఎలాంటి బ్రేక్‌ లేకుండా వైల్డ్ డాగ్ చూశా. సినిమా పూర్తయిన వెంటనే నాగ్‌కు ఫోన్‌ చేసి ఈ సినిమా గురించి ఎందుకంత తక్కువగా ప్రమోట్‌ చేశారు. ఇది చాలా గొప్ప చిత్రం. అద్భుతంగా ఉందని చెప్పాను. లిమిటెడ్ బడ్జెట్‌తో తక్కువ సమయంలో ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాల్మన్‌, నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు. అందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలి'' అని కోరారు చిరు.

ALSO READ: త్రివిక్ర‌మ్ అందుకే రాలేదా?