ENGLISH

బాల‌య్య టైటిల్ ఫిక్స్‌.. త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న‌

22 November 2020-12:30 PM

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌గ్యా జైస్వాల్, పూర్ణ క‌థానాయిక‌లు. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌కటించ‌లేదు. బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌స్తున్న 3వ సినిమా ఇది. సింహా, లెజెండ్ .. లాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ నే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంతా.

 

ఈ సినిమాకి సంబంధించి చాలా టైటిళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిలో `మోనార్క్‌` ఒక‌టి. ఇప్పుడు ఈసినిమాకి ఆ టైటిలే ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కే ఈ టైటిల్ ని రిజిస్ట‌ర్ చేసేశారు. అయితే `మోనార్క్‌` టైటిల్ లో కాస్త నెగిటీవ్ ట‌చ్ ఉంద‌ని కాస్త భ‌య‌ప‌డ్డారు. కానీ.. ఇప్పుడు అదే టైటిల్ ఖాయం చేశార‌ని తెలుస్తోంది. మోనార్క్ కంటే మంచి టైటిల్ ఏదీ బోయ‌పాటి శ్రీ‌నుకి దొర‌క‌లేద‌ని, ఇప్పుడు దాన్నే ఫైన‌ల్ చేశార‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ALSO READ: తొలి సినిమాకే కోటి రూపాయ‌లు ఇచ్చారా?