ENGLISH

'నాంది' ద‌ర్శ‌కుడి చేతిలో నాలుగు సినిమాలు

20 February 2021-16:12 PM

`నాంది`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఓ సామాజిక బాధ్య‌త ఉన్న సినిమాగా `నాంది`ని అభివ‌ర్ణిస్తున్నారు సినీ విశ్లేష‌కులు. క‌మ‌ర్షియ‌ల్ గానూ ఈ సినిమా వ‌ర్క‌వుట్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అందుకే ద‌ర్శ‌కుడు విజ‌య్ కి వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే విజ‌య్ కి న‌లుగురు నిర్మాత‌లు అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

 

`నాంది` టీమ్ తోనే విజయ్ మ‌రో సినిమాకి ఫిక్స‌య్యాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలోనూ న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ట‌. అయితే.. అంత‌కు ముందు... విజ‌య్ మ‌రో సినిమా చేసుకుంటాడ‌ని, ఇప్ప‌టికే ఆ సినిమాకి సంబంధించిన ఎగ్రిమెంట్లు పూర్త‌య్యాయ‌ని టాక్‌. మ‌రి.. నాంది ద‌ర్శ‌కుడి త‌దుప‌రి సినిమాకి హీరో ఎవ‌రన్న‌ది తెలియాలి. ఈసారి కూడా విజ‌య్ ఓ సోష‌ల్ ఇష్యూతోనే సినిమా చేస్తాడ‌ని, అందుకు సంబంధించిన క‌థ రెడీ అయ్యింద‌ని, హీరో ఫైన‌లైజ్ కావాల‌ని స‌మాచారం అందుతోంది.

ALSO READ: క్రిష్‌కి మ‌రో ప‌ది రోజులు ఇచ్చిన ప‌వ‌న్‌