ENGLISH

క్రిష్‌కి మ‌రో ప‌ది రోజులు ఇచ్చిన ప‌వ‌న్‌

20 February 2021-13:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. నెల‌కు కొన్ని కాల్షీట్లు అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ కి కేటాయిస్తే.. మ‌రి కొన్ని క్రిష్ సినిమాకి ఇస్తున్నాడు. ఇంకొన్ని.. త‌న రాజ‌కీయాల‌కు కేటాయిస్తున్నాయి. ప్ర‌స్తుతం అప్ప‌య్య‌యుమ్ కోషియ‌మ్ రీమేక్ షూటింగ్ ఆగింది. దాంతో క్రిష్ సినిమాకి కాల్షీట్లు ఇచ్చే అవ‌కాశం వచ్చింది. ప‌వ‌న్ - క్రిష్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

 

నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఏ.ఎం.ర‌త్నం నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ వ‌చ్చే వారం హైద‌రాబాద్ లో ప్రారంభం కానుంది. ఓ ప‌ది రోజుల పాటు.. ప‌వ‌న్ - నిధిల‌పై కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఇందుకోసం గోల్కొండ సెట్ ని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్ నేతృత్వంలో ఈ సెట్ నిర్మాణం జ‌రుగుతోంది. అతి త్వ‌ర‌లో..ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా... టైటిల్ కూడా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. విరూపాక్ష అనే టైటిల్ ఈ సినిమా కోసం ప్ర‌చారంలో ఉంది.

ALSO READ: నితిన్ నామ సంవ‌త్స‌రం