ENGLISH

'నారప్ప'కోసం ఆ మార్పులు నిజమేనా?

27 January 2020-13:00 PM

తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'అసురన్‌'కి 'నారప్ప' రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే, తెలుగు నేటివిటీకి సంబంధించి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. కానీ, లుక్‌ మాత్రం యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఒరిజినల్‌లోని ధనుష్‌ లుక్‌నే పోలి ఉండడంతో సినిమా కథ కూడా సేమ్‌ టు సేమ్‌ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కొన్ని యదార్ధ సంఘటనల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. దళితుల అణచివేత నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ కోణంలో కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్‌ని ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఆయా సీన్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతాయంటున్నారు.

 

ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారట. ఇప్పటికే 'నారప్ప'గా వెంకటేష్‌ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మరోవైపు సినిమాని వీలైనంత ఎర్లీగా పూర్తి చేసేస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం అనంతపురంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'నారప్ప'కు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్సిచ్చాడు.. త‌ప్పు చేస్తున్నాడా??