ENGLISH

మ‌రోసారి అయోమ‌యంలో ప‌డ్డ నాగ అశ్విన్‌

20 November 2020-11:00 AM

మ‌హాన‌టి త‌ర‌వాత‌.. ప్ర‌భాస్ కి ఒక క‌థ చెప్పి, సినిమా ఓకే చేయించుకున్నాడు నాగ అశ్విన్‌. నిజానికి రాధే శ్యామ్ త‌ర‌వాత‌.. నాగ అశ్విన్ సినిమానే మొద‌ల‌వుతుంద‌నుకున్నారు. ఈలోగా స‌డ‌న్ గా `ఆది పురుష్` వ‌చ్చింది. `రాధే శ్యామ్‌` త‌ర‌వాత నాగ అశ్విన్ సినిమాకి నెల‌రోజులు స‌మ‌యం ఇచ్చి, ఆ త‌ర‌వాత‌.. ఆదిపురుష్ పూర్తి చేస్తాడ‌ని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నెల రోజుల స‌మ‌యం కూడా ఇవ్వ‌డ‌ని తేలిపోయింది. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 11, 2022లో ఆది పురుష్ విడుద‌ల కాబోతోంది.

 

2021 అంతా ప్ర‌భాస్ ఈ సినిమాతోనే గ‌డుపుతాడు. అంటే.. ఆది పురుష్ త‌ర‌వాతే.. నాగ అశ్విన్ సినిమా అన్న‌మాట‌. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం నాగ అశ్విన్ సినిమా 2021 చివ‌ర్లో మొద‌ల‌వుతుంది. అది కూడా రెండేళ్ల ప్రాజెక్టు. అంటే నాగ అశ్విన్ సినిమా వ‌చ్చేస‌రికి 2023 అయిపోతుంది. నాగ అశ్విన్ యేడాది పాటు.. ఖాళీగా ఉంటాడా? లేదంటే మ‌రో సినిమా ఓకే చేయించుకుంటాడా? అన్న‌ది అనుమానంగా మారింది.

 

నిజానికి నాగ అశ్విన్ కి చ‌క చ‌క సినిమాలు చేయాల‌న్న ఉద్దేశం లేదు. ఆయ‌న ప్ర‌యాణం ముందు నుంచీ నిదాన‌మే. అందుకే.. ఆయ‌న ప్ర‌భాస్ సినిమా కోసమే ఎదురు చూసే అవ‌కాశాలున్నాయి. మొత్తానికి ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ నాగ అశ్విన్ ని అయోమ‌యంలో ప‌డేసింద‌న్న‌ది వాస్త‌వం.

ALSO READ: 'మిడిల్ క్లాస్ మెలొడీస్‌' మూవీ రివ్యూ & రేటింగ్!