ENGLISH

ట్విట్ట‌ర్‌లో నాగ‌బాబు ఆవేశం

02 June 2020-15:00 PM

ట‌వ‌ర్ స్టార్ నాగ‌బాబు కాస్త ఈమ‌ధ్య ట్విట్ట‌ర్ స్టార్‌గా మారిపోయారు. ఆయ‌న్నుంచి ప‌దునైన వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. కొన్నిసార్లు అవే వివాదం తెచ్చి పెడుతున్నాయి. గాడ్సేని దేశ‌భ‌క్తుడిగా పోలుస్తూ నాగ‌బాబు చేసిన ట్వీట్ విమ‌ర్శల‌కు దారి తీసింది. చివ‌రికి అవి జ‌న‌సేన త‌ల‌కు చుట్టుకున్నాయి. ఇప్పుడు మ‌రోసారి కొన్ని ఘాటైన వ్యాఖ్య‌లుల చేశారు. భార‌తీయుల ర‌క్తం శాంతి, అహింస మంత్రాల‌తో చ‌ల్ల‌బ‌డిపోయింద‌ని, ఆ ర‌క్తం తిరిగి వేడెక్కాలంటే ఛ‌త్ర‌ప‌తి, ఫృథ్వీరాజ్ చౌహాన్ ల క‌థ‌లు చెప్పాలంటూ ట్వీట్ చేశారు. ఆయ‌న ట్వీట్ల నిండా సాహ‌సం, ర‌క్తం, పోరాటం గురించే ఉందే.

 

''మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ ఆయనా సాహసం,పౌరుషం,మరిగే రక్తం తో పెరుగుతారు.ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది.వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం.భారత దేశానికి ,దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి,డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు.దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు,గుండాలు,మాఫియా,ఫ్యాక్షన్, గుండా రాజకీయనాయకులు,కుహనా ఉదారవాదులు,ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక.ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని'' అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు. నాగ‌బాబు రక్తం, ఇప్పుడు, ఈ స‌మ‌యంలో ఇలా పొంగిపోతోందేంటి? అంటూ ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఆశ్చ‌ర్యాన్ని వ‌క్తం చేస్తున్నారు. ఆయ‌న ఆవేశానికి కార‌ణం ఏమిటో?

ALSO READ: వ‌కీల్ సాబ్‌.. ఇప్ప‌ట్లో రాడా?