ENGLISH

వ‌కీల్ సాబ్‌.. ఇప్ప‌ట్లో రాడా?

02 June 2020-14:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు `వ‌కీల్ సాబ్` గురించి ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగితే ఈపాటికి విడుద‌లైపోయి, హిట్టో ప‌ట్టో తేలిపోయేది. వ‌సూళ్ల లెక్క‌లు వేసుకుంటూ నిర్మాత‌లు, అభిమానులూ బిజీగా ఉండేవారు. కానీ.. క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని సినిమాల్లానే వ‌కీల్ సాబ్ కూడా ఆగిపోయింది.

 

అయితే షూటింగులు మొద‌లెట్టిన వెంట‌నే ఈ చిత్రాన్ని చ‌క చ‌క పూర్తి చేసి, వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేద్దామ‌ని దిల్ రాజు భావించాడ‌ట‌. కానీ.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌డం లేదు. ఈసినిమాకి ఇంకా 35 రోజుల షూటింగ్ బాకీ ఉంద‌ని తెలుస్తోంది. ఆ త‌ర‌వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, ప‌బ్లిసిటీ. మంచి డేట్ చూసుకోవాలి. అప్పుడు రిలీజ్ చేయాలి. వ్య‌వ‌హారం చూస్తుంటే అక్టోబ‌రు - న‌వంబ‌రు వ‌ర‌కూ వ‌కీల్ సాబ్ రాడేమో అన్న అనుమానం వేస్తోంది. జులైలో షూటింగ్ పూర్తి చేసి, ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకుంటే త‌ప్ప‌... ఈ సినిమా అనుకున్నంత త్వ‌ర‌గా రాక‌పోవొచ్చు. సో... ఓ ర‌కంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఇది చేదు వార్తే.

ALSO READ: స‌మంతకి షాకిచ్చిన ఫ్యాన్.