ENGLISH

నాగబాబు ఇంత పెద్ద షాకిచ్చాడేంటో!

07 September 2020-15:30 PM

నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు నాగబాబు ఈ మధ్య సంచలనాత్మక స్టేట్‌మెంట్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న విషయం విదితమే. బాలయ్య మీద కామెంట్స్‌ అలాగే, వివిద అంశాలపై ఆయన అభిప్రాయాలు ప్రత్యర్థులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దాంతో ఆయన్ని టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేయడానికి ప్రత్యర్థులు వెనుకాడ్డంలేదు. ఇదిలా వుంటే, తాజాగా నాగబాబు, హాట్‌ హీరోయిన్‌ రాధికా ఆప్టేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ట్వీటేశారు. ఇదిప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాధికా ఆప్టే, హాట్‌ హాట్‌ సినిమాలు చేయడంలో దిట్ట. ఇండిపెండెంట్‌ భావాలు ఆమెకు చాలా ఎక్కువ. న్యూడ్‌గానూ కొన్ని సినిమాల్లో నటించింది. పైగా, ఆమె తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడిపై కొన్నాళ్ళ క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాధికా ఆప్టేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పేమీ కాదుగానీ, చాలా అరుదుగానే ఆయన సినీ ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతుంటారనీ, ఆమె విషయంలో ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారనీ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

 

కొత్త తరం నటీమణులకు నువ్వొక ట్రెండ్‌ సెట్టర్‌.. అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

ALSO READ: Radhika Apte Latest Photoshoot