ENGLISH

చైతూకి మ‌రో షాక్ ఇచ్చిన స‌మంత‌

22 March 2022-16:22 PM

నాగ‌చైత‌న్య - స‌మంత విడిపోయి చాలా రోజులైంది. అయినా స‌రే, ఈ జంట‌కు సంబంధించిన క‌బుర్లు ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే. చైతో విడాకులు తీసుకున్న త‌ర‌వాత స‌మంత సోష‌ల్ మీడియాలో మ‌రింత జోరు పెంచింది. జీవితం, ఫిలాస‌ఫీ కి సంబంధించిన కొటేష‌న్లు పెడుతూ - త‌న మ‌న‌సులోని భావాల్ని, త‌న బాధ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది. ఆమ‌ధ్య‌... పెళ్లినాటి ఫొటోల్ని సోష‌ల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. అంతేకాదు. పెళ్లి ప‌ట్టుచీర‌ని కూడా తిరిగి పంపించేసింద‌ని టాక్ న‌డుస్తోంది.

 

ఇప్పుడు చైకి మ‌రో షాక్ ఇచ్చింది. చై ఇన్ స్టా ఎకౌంట్ ని స‌మంత అన్ ఫాలో చేసింది. అయితే అదే సంద‌ర్భంలో మిగిలిన అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబ హీరోలు, వ్య‌క్తుల ఎకౌంట్ల‌ను మాత్రం ఫాలో అవుతూనే ఉంది. నాగార్జున‌, రానా, అమ‌ల‌, అఖిల్ ల ఎకౌంట్ల‌ని స‌మంత ఇప్ప‌టికీ ఫాలో అవుతోంది. అదే విధంగా నాగ‌చైత‌న్య సైతం... స‌మంత ఇన్ స్టాని ఫాలో అవుతున్నాడు. స‌మంత మాత్రం ఇప్పుడు చై ఇన్ స్టా ఎకౌంట్ ని అన్ ఫాలో చేయ‌డం.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మ‌రి ఇప్పుడు చైతూ ఏం చేస్తాడో చూడాలి.

ALSO READ: శర్వా త‌న త‌ప్పు తెలుసుకున్నాడా?