ENGLISH

న‌య‌న‌తార త‌ల్లి కాబోతోందా?

22 March 2022-15:20 PM

ద‌క్షిణాదిన అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. 37 ఏళ్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ... త‌మిళంలో త‌న‌దే డామినేష‌న్‌. న‌య‌న‌తార ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంది. ఇది వ‌ర‌కెప్పుడో వీళ్ల నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అయితే.. వీళ్ల పెళ్లి అయ్యిందా, లేదా? అనేదాంట్లో స్ప‌ష్ట‌త లేదు. ఎప్పుడు చూసినా, ఎక్క‌డ చూసినా క‌లిసే ఉంటారు. కానీ పెళ్లి విష‌యం మాత్రం చెప్ప‌రు.

 

ఇప్పుడు న‌య‌న అయితే... త‌ల్లి కావ‌డానికి సిద్ధంగా ఉంద‌ట‌. అది కూడా స‌రోగ‌సీ ద్వారా. స‌రోగ‌సీ విధానం ద్వారా న‌య‌న త‌ల్లి కాబోతోంద‌ని, అందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంద‌ని త‌మిళ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌న క‌థానాయిక‌ల్లో కొంత‌మంది స‌రోగ‌సీ ద్వారా త‌ల్లులు అయిన‌వాళ్లే. ప్రీతీజింటా, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రాల‌కు స‌రోగ‌సీనే మాతృత్వం ప్ర‌సాదించింది. ఇప్పుడు వాళ్ల బాట‌లోనే.. న‌య‌న కూడా వెళ్ల‌బోతోంద‌ని టాక్. త‌ల్లి కావాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిందంటే... త్వ‌ర‌లోనే పెళ్లి వార్త కూడా చెప్పేస్తుంద‌న్న‌మాట‌.

ALSO READ: శర్వా త‌న త‌ప్పు తెలుసుకున్నాడా?