ENGLISH

శర్వా త‌న త‌ప్పు తెలుసుకున్నాడా?

22 March 2022-13:00 PM

టాలీవుడ్ లోని యంగ్‌.. టాలెంటెడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. త‌న‌వ‌న్నీ డీసెంట్ చిత్రాలే. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి శ‌ర్వా అంటే ప్ర‌త్యేక‌మైన ఇష్టం ఏర్ప‌డింది. పైగా చూడ్డానికి చ‌క్క‌గా ఉంటాడు. అయితే ఈమ‌ధ్య వ‌రుస ఫ్లాపులు శ‌ర్వాని వేధిస్తున్నాయి. ఎంతో ఆశ ప‌డి చేసిన `ఆడ‌వాళ్లూ మీకు జోహార్లూ` సినిమా ఫ్లాప‌యింది. పైగా... ఈమ‌ధ్య శ‌ర్వా బాగా లావుగా క‌నిపిస్తున్నాడు. క‌థ‌ల‌పై దృష్టి పెట్డడం ఎంత అవ‌స‌ర‌మో, త‌న శ‌రీరాన్ని అదుపులో పెట్టుకోవ‌డం కూడా అంతే అవ‌స‌ర‌మైంది.

 

ఈమ‌ధ్య ప్ర‌తీ సినిమాలోనూ లావుగా క‌నిపిస్తున్నాన్న సంగ‌తి శ‌ర్వాకి ఇప్పుడు అర్థ‌మైంది. అందుకే అర్జెంటుగా త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో శ‌ర్వా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంది. ఈలోగా కావ‌ల్సినంత టైమ్ ఉంది. అందుకే ఈ స‌మ‌యాన్ని త‌న ఫిట్‌నెస్‌కి కేటాయించాల‌ని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర్వా బ‌రువు త‌గ్గే ప‌నుల్లో బిజీగా ఉన్నాడ‌ని టాక్‌. రాబోయే మూడు నెల‌ల్లో క‌నీసం 8 కేజీలు త‌గ్గాల‌ని టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే శ‌ర్వా కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ లేటెస్ట్‌: ఎన్టీఆర్ ఎంట్రీ ఆల‌స్యం