ENGLISH

నాగచైతన్యకి అవంటే అంత భయమా?

05 October 2017-17:27 PM

'రాజుగారి గది - 2' సినిమాలో సమంత దయ్యం పాత్రలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే. సమంత ఇంతవరకూ చేయని పాత్ర అది. కథ నచ్చి, పాత్రకున్న ప్రాధాన్యం నచ్చి, ఆ క్యారెక్టర్‌కి సమంత ఒప్పుకుంది. అయితే సమంతని పెళ్లాడనున్న అక్కినేని బుల్లోడు నాగచైతన్యకి మాత్రం దెయ్యాలంటే చచ్చేంత భయమ. అందుకే దెయ్యాల సినిమాలు చూడాలన్న చైతూకి భయమేనట. దెయ్యం పాత్రలో సమంతని చూడలేనంటున్నాడు చైతూ. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాని ఆయన చూస్తారా? అంటే ఏమో చెప్పలేనంటున్నాడు చైతూ. అయినప్పటికీ, 'రాజుగారి గది - 2' సినిమా వెరీ వెరీ స్పెషల్‌ అనీ, నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనీ ఆయన కోరుకుంటున్నాడు. అయినా చైతూ చెబితే మాత్రం సమంత ఊరుకుంటుందా.. తన సినిమా చూడనంటే. ఇది సరే రేపే సమంత, నాగ చైతన్యల వివాహం గోవాలో జరగనుంది. హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. తర్వాత హైద్రాబాద్‌లో రిసెప్షన్‌ జరగనుంది. అక్టోబర్‌ 15 నుండే సమంత, నాగచైతన్యలు తిరిగి తమ తమ సినిమాలతో బిజీ కానున్నారు. నాగ చైతన్య 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు. ఇవి కాక చందూ మొండేటితో ఓ సినిమా, మరో రెండు ప్రాజెక్టులు చైతూ చేతిలో ఉన్నాయి. సమంత 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తోంది. చరణ్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా.

ALSO READ: సినీ వెబ్‌సైట్స్‌ అశ్లీలతపై వేటు పడింది