ENGLISH

ప్రియమణి భర్త ఎంత మంచోడంటే

05 October 2017-17:23 PM

ఇటీవలే ముద్దుగుమ్మ ప్రియమణి ముస్తఫా రాజ్‌ని వివాహం చేసుకుంది. ముస్తఫాని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి, ప్రేమ విషయాలను గురించి ముచ్చటించింది. భర్త ముస్తపా చాలా మంచివాడనీ, తనని చాలా బాగా అర్ధం చేసుకున్నాడనీ ఆమె తెలిపింది. తొలి సారి కలిసినప్పుడు జస్ట్‌ ఫ్రెండ్స్‌లా మూవ్‌ అయ్యామనీ, తర్వాత ఒకరికొకరు మనసు ఇచ్చి పుచ్చుకున్నామనీ, అలాగే ఒకరి ఇష్టాలు మరొకరు గౌరవించుకున్నామనీ ఆ తర్వాతే పెళ్లికి ఓకే చేసుకున్నామనీ ప్రియమణి తెలిపింది. పెళ్లి తర్వాత వెంటనే ఆమె షూటింగ్‌కి వెళ్లిపోయిందట. అందుకు తన భర్త ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదనీ, ఆ విషయంలో తనకి చాలా సంతోషంగా ఉందనీ ప్రియమణి చెప్పింది. అలాగే పెళ్లయితే భార్య ఇంటికే పరిమితం అవ్వాలనే టైప్‌ ముస్తఫా కాదనీ ఆమె తెలిపింది. పెద్దగా హంగు, ఆర్భాటం లేకుండా సింపుల్‌గా వివాహం చేసుకున్న ప్రియమణిని, ఎందులా అని అడిగితే, ఆ టైంలో ఆమె బంధువులు ఒకరు చనిపోయారనీ, అందుకోసమే ఎక్కువగా ఆర్భాటం చేయడం ఇష్టం లేకనే అతి కొద్ది మంది అతిధుల మధ్య తన వివాహం జరిగిందనీ ప్రియమణి తెలిపింది. మొత్తానికి మంచి భర్త దొరికినందుకు ప్రియమణి ఫుల్‌ ఖుషీగా ఉందనీ ఆమె మాటల ద్వారానే తెలుస్తోంది. ఆమె అభిమానులకు కావాల్సింది కూడా అదే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయనప్పటికీ, ఇతర భాషా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే బుల్లితెరపై ఓ డాన్స్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది ముద్దుగుమ్మ ప్రియమణి.

ALSO READ: సినీ వెబ్‌సైట్స్‌ అశ్లీలతపై వేటు పడింది