ENGLISH

అక్కినేని బుల్లోడు దూకుడు మీదున్నాడు

20 June 2018-11:01 AM

యంగ్‌ హీరోల్లో నాగచైతన్య ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు మూడు, నాలుగు సినిమాలు చైతూ చేతిలో ఉన్నాయిప్పుడు. అందులో 'సవ్యసాచి' ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

సో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం కావస్తోంది. టైటిల్‌, ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్‌ ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళ రొమాంటిక్‌ హీరో మాధవన్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడనే అంశం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇకపోతే ఎప్పుడెప్పుడు 'సవ్యసాచి' ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు.

 

'సవ్యసాచి' సంగతిటుంచితే, మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో నటిస్తున్నాడు. 'శైలజారెడ్డి' పాత్రను శివగామి రమ్యకృష్ణ పోషిస్తోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో చైతూతో జత కడుతోంది. కాగా మామ వెంకీతో ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు చైతూ. 'వెంకీ మామా' అనే క్రేజీ టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. 

ఇవన్నీ ఒకెత్తు కాగా, 'నిన్ను కోరి' సినిమాతో హిట్‌ ఇచ్చిన యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ ఓ లవ్‌స్టోరీ చేయబోతున్నాడన్న వార్త కూడా ఇటీవల కన్‌ఫామ్‌ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతున్నారు చైతూ - సమంత ఈ సినిమాలో. ఇదో స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా అంటూ తాజా సమాచారమ్‌. ఈ స్పీడులో చైతూ నుండి రాబోయే సక్సెస్‌లు ఎన్నో చూడాలిక.
 

 

ALSO READ: సంజన ఎలిమినేషన్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?