ENGLISH

గ్లామర్‌లో కొత్త కిక్‌ ఇస్తానంటోన్న రాశీఖన్నా

20 June 2018-10:55 AM

యంగ్‌ హీరో నితిన్‌ - రాశీఖన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాపై అంచనాలున్న మాట వాస్తవమే. ఎందుకంటే, 'శతమానం భవతి' వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీని అందించిన కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. 

డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న, దిల్‌ రాజు కాంబోలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ సినిమా కోసం అందాల భామ రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ తగ్గించేసిందంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు ఈ గాసిప్‌కి ఓ కారణం కావచ్చు. ఇంతవరకూ ఈ సినిమా నుండి విడుదలైన పెళ్లి పోస్టర్స్‌కి ఎంత మంచి రెస్పాన్స్‌ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాగే రాశీఖన్నా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు కూడా ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపిస్తుండడం, అవన్నీ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాకి సంబంధించినవే అని భావించడం జరుగుతోంది. 

ఏది ఏమైనా సతీష్‌ వేగేశ్న చిత్రాల్లో ట్రెడిషనల్‌ లుక్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఆ యాంగిల్‌లో చూస్తే రాశీఖన్నా నుండి ఈ సినిమాలో గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేమని తెలుస్తోంది. అయినా కానీ రాశీఖన్నా సరికొత్త గ్లామర్‌ లుక్‌లో కనిపించనుందట ఈ సినిమాలో. 'తొలిప్రేమ'లో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించినా, గ్లామర్‌లో ఎక్కడా హద్దులు మీరలేదు. 

అలాగే 'శ్రీనివాస కళ్యాణం'లో కూడా గ్లామర్‌ కన్నా, అంతకుమించిన పర్‌ఫామెన్స్‌ ప్రదర్శించే పాత్ర కావడంతో, కనీ కనిపించని గ్లామర్‌ టచ్‌తో కుర్రకారుకు కొత్త కిక్‌ ఇస్తానంటోంది అందాల భామ రాశీఖన్నా.

 

ALSO READ: Qlik Here For The Gallery Of Raashi Khanna