తొలి సినిమా సోగ్గాడే చిన్ని నాయనతో ఆకట్టుకున్నాడు కల్యాణ్ కృష్ణ. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. నాగ్‌కి అది బాగా నచ్చేసింది.
కాకపోతే... ఈలోగా నాగచైతన్యతో ఓసినిమా చేయమని ఆఫర్ ఇచ్చాడు. అలా.. రారండోయ్ వేడుక చూద్దాం పట్టాలెక్కింది. ఆ వెంటనే... కల్యాణ్ కృష్ణకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేశాయి. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తరవాత నాగచైతన్య - వెంకీలతో ఓ మల్టీస్టారర్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అందుకే బంగార్రాజు ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందేమో అనుకున్నారంతా.
కానీ.. ఇప్పుడు ఈ కాంబినేషన్‌పై మళ్లీ ఆశలు చిగురించాయి. `బంగార్రాజు` సినిమా పట్టాలెక్కడం ఖాయమని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాగ్, కల్యాణ్ కృష్ణ చేతుల్లోని సినిమాలు ముగిశాక... తప్పకుండా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని, ఇది అన్నపూర్ణ సంస్థలోనే ఉంటుందని టాక్. బహుశా 2019 ప్రారంభంలో ఈసినిమా ఉండొచ్చు.
ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!