ENGLISH

నాగ్ పారితోషికం మ‌రీ అంతా...?

06 September 2021-12:00 PM

బిగ్ బాస్ వ‌ల్ల ఎవ‌రు ఎలా లాభ ప‌డుతున్నారు..? సీజ‌న్ విన్న‌ర్ల‌కు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయా, రావ‌డం లేదా? అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే, ఈ షో తో ఎన్టీఆర్‌, నాని, నాగార్జున మాత్రం బాగానే సొమ్ము చేసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నాగార్జున‌. మూడు, నాలుగో సీజ‌న్‌లకు నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించాడు. మూడో సీజ‌న్‌కి 8 కోట్లు, నాలుగో సీజ‌న్ కి నాగ్ 10 కోట్ల పారితోషికం తీసుకున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి.

 

ఈసారి నాగ్ పారితోషికం మ‌రింత పెరిగింది. 5వ సీజ‌న్ కి ఏకంగా 14 కోట్ల పారితోషికం అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్‌, నానిల కంటే.. నాగ్ పారితోషిక‌మే ఎక్కువ‌. 100 రోజుల పాటు సాగే సీజ‌న్ ఇది. నాగ్ వారాంతంలో వ‌స్తాడు. అంటే... క‌నీసం 12 వారాలు సాగుతుంది. అంటే 24 ఎపిసోడ్ల‌లో నాగ్ క‌నిపిస్తాడ‌న్న‌మాట‌. రెండు ఎపిసోడ్ల‌నీ ఒకే రోజు పూర్తి చేస్తారు. అంటే నాగ్ ఈ షో కోసం కేటాయించేది 12 రోజులే. 12 రోజుల‌కు 14 కోట్లంటే.... మాట‌లా? అందుకే నాగ్ ఈ షోని వ‌ద‌ల‌డం లేదు.

ALSO READ: సిటీమార్‌కి ఎన్ని స‌వాళ్లో..?!