నాగార్జున - రామ్‌గోపాల్ వర్మ కాంబినేసన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆఫీసర్'. గత కొంత కాలంగా ముంబయ్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ 99 శాతం కంప్లీట్ అయిపోయిందని నాగార్జున ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మను తాను చాలా మిస్ అవుతున్నాననీ నాగ్ ట్వీట్ చేశారు. అందుకు రామ్‌గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రీ ట్వీట్ చేశారు.
'నాగ్ మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు మమ్మల్ని వదిలి హైద్రాబాద్ వెళ్లిపోతున్నందుకు బాధను దిగమింగుకుని, సంతోషంగానే ఉన్నట్లు నటిస్తున్నాం..' అని వర్మ ట్వీట్ చేశారు. అదంతే, వర్మ..తన ట్వీట్స్‌లో సమ్‌థింగ్ డిఫరెన్స్ కనిపించాలని అనుకుంటారు. అందుకే 'ఆర్‌జీవీ ట్వీట్స్'కి అంత పాపులారిటీ. ఇకపోతే ఆ దేవుడి కన్నా నాగార్జుననే ఎక్కువ నమ్ముతాను నేను అని వర్మ గతంలో ఓ సారి అన్నారు. అంటే నాగార్జున అంటే వర్మకెంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగు సినిమా స్టేటస్‌ని మార్చేసింది గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'శివ' సినిమా. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చినప్పటికీ, 'శివ' సినిమాకున్న క్రేజ్ మరే సినిమాకి రాలేదు. అయితే ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న ఈ 'ఆఫీసర్' సినిమాపై ఆ స్థాయిలో అంచనాలు నెలకొంటున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నాగ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ముంబయ్‌లోనే ఎక్కువ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించారు. మే 25న 'ఆఫీసర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ సరసన ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ALSO READ: ప్రముఖ గాయని చిన్మయికి లైంగిక వేధింపులు