నాగార్జున ఇటీవల `వైల్డ్ డాగ్` అవతారం ఎత్తారు. టెర్రరిజం నేపథ్యంలో సాగే సినిమా ఇది. రివ్యూస్ బాగానే వచ్చాయి. చిరంజీవి లాంటి స్టార్ ముందుకొచ్చి - ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. అయినా సరే, వసూళ్లు దారుణంగా ఉన్నాయి. తొలి వారాంతంలో కనీసం 3 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆదివారం నాటికి కేవలం 2.8 కోట్లు రాబట్టింది. మరో 7 కోట్లు రాబడితే తప్ప, బ్రేక్ ఈవెన్ అందుకోదు. ఈ అంకె దాటడం వైల్డ్ డాగ్‌కి అసాధ్యమే.
వైల్డ్ డాగ్ 3 రోజుల వసూళ్లు
నైజాం  0.99 కోట్లు
సీడెడ్  0.34 కోట్లు
ఉత్తరాంధ్ర  0.34 కోట్లు
ఈస్ట్  0.17 కోట్లు
వెస్ట్  0.13 కోట్లు
గుంటూరు  0.18 కోట్లు
కృష్ణా  0.19 కోట్లు
నెల్లూరు  0.11 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)  2.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.12 కోట్లు
ఓవర్సీస్  0.22 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)  2.8 కోట్లు
ALSO READ: నాగ్ నన్ను గర్వపడేలా చేశారు : చిరు