ENGLISH

నిమిషానికి అక్ష‌రాలా కోటి రూపాయ‌లు

06 April 2021-09:07 AM

వకీల్ సాబ్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు దిల్ రాజు భారీ మొత్తంలో పారితోషికం అందించాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే వుంది. ఈ సినిమాకి గానూ ప‌వ‌న్ 50 కోట్లు అందుకున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల గుస‌గుస‌. నిజానికి ప‌వ‌న్‌కి అంత స్టామినా ఉంది. ప‌వ‌న్ లాంటి స్టార్‌కి అంత పారితోషికం ఇవ్వ‌డంలో ఎలాంటి విచిత్ర‌మూ లేదు. దానికి తోడు.. వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో అద‌ర‌గొట్టింది. 90 కోట్ల రూపాయ‌లు థియేట‌రిక‌ల్ రిలీజ్ నుంచే వ‌చ్చేశాయి.

 

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రీన్ టైమ్ విష‌యంలోనూ ఓ వార్త ఇప్పుడు గట్టిగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ ప‌ట్టుమ‌ని 50 నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. 2 గంట‌ల 23 నిమిషాల నిడివిగ‌ల సినిమా ఇది. అందులో 50 నిమిషాలంటే... స‌గం కంటే త‌క్కువ అని చెప్పాలి. ప‌వ‌న్ కి ఇచ్చిన పారితోషికం తో లెక్క‌గ‌డితే..... ఒక్క నిమిషానికీ కోటి రూపాయ‌లు అందుకున్నాడ‌న్న మాట‌.

 

ఇది మాత్రం రికార్డ‌నే చెప్పాలి. ఎందుకంటే ప్ర‌భాస్‌, మ‌హేష్ లు కూడా పవ‌న్ తో పోటీ ప‌డి పారితోషికం అందుకుంటున్న వాళ్లే. కానీ... నిమిషాల కింద లెక్కేస్తే.. వాళ్ల పారితోషికాలు కూడా ఇంతింత ఉండ‌వు. ఆ లెక్క‌న ప‌వ‌న్ కొత్త రికార్డు సృష్టించిన‌ట్టే.

ALSO READ: నాగ్ నన్ను గర్వపడేలా చేశారు : చిరు