ENGLISH

మ‌హేష్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న నమ్రత కథనాలు!

23 September 2020-12:00 PM

తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్టు - డ్ర‌గ్స్ రాకెట్ లో ఒకొక్క‌రి పేరూ బ‌య‌ట‌కు వ‌స్తోంది. తాజాగా న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు ఈ కేసులో బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎన్‌సీబీ అధికారులు చేసిన ట్రాకింగ్ లో న‌మ్ర‌త - జ‌య‌సాహో ల‌మ‌ధ్య చాటింగ్ బ‌య‌ట‌ప‌డింది. అందులో న‌మ్ర‌త డ్ర‌గ్స్ కావాల‌ని జ‌య‌సాహోని అడ‌గ‌డం స్ప‌ష్టంగా ఉంది. దాంతో న‌మ్ర‌త కూడా ఈ కేసులో ఇరుక్కుంది. అయితే... ఇది ఇప్పుడు న‌మ్ర‌త‌కు సంబంధించిన విష‌యం మాత్ర‌మే కాదు. మ‌హేష్ బాబుకీ అంటుకునే ఛాన్స్ ఉంది.

 

మ‌హేష్ భార్య‌గానే న‌మ్ర‌త ఎక్కువ మందికి తెలుసు. జాతీయ వార్తా ఛాన‌ళ్లు కూడా మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త‌... అంటూనే ప్ర‌స్తావిస్తున్నాయి. దాంతో మ‌హేష్ ఇమేజ్‌కి సైతం డామేజీ ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే.. న‌మ్ర‌త‌ని ఎన్‌సీబీ అధికారులు విచారించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ విచార‌ణ‌లో ఏం తేలుతుంది? అక్క‌డ న‌మ్ర‌త ఏం చెబుతుంది? అనే విష‌యాల‌పై మ‌హేష్ ఫ్యాన్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే.... సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌తో మొద‌లైన ఈ కేసు - టాలీవుడ్ ని సైతం క‌మ్మేసేలా క‌నిపిస్తోంది.

ALSO READ: ఈ సారికి నానితో స‌ర్దుకుపోతాడా?