ENGLISH

దటీజ్‌ నాని: భలే కౌంటర్‌ ఇచ్చాడే.!

19 June 2018-18:15 PM

'బిగ్‌బాస్‌' హోస్ట్‌గా నానిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. తనను తప్పించాడంటూ శ్రీరెడ్డి ఓ పక్క ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి రీసెంట్‌గా ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చిన సంజన కూడా నానిపై సంచలన ఆరోపణలు చేసింది. సంజన ఆరోపణలకు నాని చాలా డీసెంట్‌గా కౌంటర్‌ ఇచ్చాడు. 

నాక్కూడా ఐఫోన్‌ (ఎన్టీఆర్‌) అంటే ఇష్టమని నాని స్పందించాడు. అంటే ఎన్టీఆర్‌ అంటే తనకీ ఇష్టమేనని నాని చెప్పాడు. తనకు ఎన్టీఆర్‌ అంటే ఇష్టమని చెప్పిన సంజనకు నాని ఇచ్చిన సమాధానమన్నమాట ఇది. అయితే కంటెస్టెంట్స్‌ సెలక్షన్‌, ఎలిమినేషన్స్‌ విషయంలో నానికి ఏ విధమైన సంబంధం లేదు. నాని జస్ట్‌ హోస్ట్‌ అంతే. అలాంటిది నానిపై ఆరోపణలు చేయడమంటే అచ్చంగా పబ్లిసిటీ స్టంటే తప్ప, మరోటి కాదని గ్రహించాలి. 

'బిగ్‌బాస్‌' షో అంటే జస్ట్‌ ఏ గేమ్‌ షో అంతే. అక్కడ ఎలాంటి పోలిటిక్స్‌ ఉండవు. ఎలిమినేషన్‌ అనేది గేమ్‌లో వన్‌ ఆఫ్‌ ది రూల్‌ అంతే. ఎంట్రీకి ముందే గేమ్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ని కంటెస్టెంట్స్‌కి సవివరంగా వివరిస్తారు. వాటికి సమ్మతమయ్యాకే, వారు హౌస్‌లోకి ఎంటర్‌ అవుతారు. ఈ ప్రోసెస్‌లో ఎక్కడా నాని ప్రమేయం ఉండదు. బిగ్‌బాస్‌ యూనిట్‌పై ఆరోపణలు చేస్తే అది మరోలా ఉంటుంది. కానీ నానిపై ఆరోపణలు చేయడం భావ్యం కాదు. 

ఇకపోతే ఎలిమినేషన్‌ అనేది తప్పు చేస్తే వచ్చేది కాదు, గేమ్‌ రూల్స్‌ ప్రకారం ఎవ్రీ వీక్‌ ఆడియన్స్‌ ఓటింగ్‌ననుసరించి నామినేట్‌ అయిన వారిలో ఒకరు బయటికి రాక తప్పదు. అది తప్పు కాదు, గేమ్‌లో ఓడిపోవడం లెక్కలోకి వస్తుందంతే. ఒకరు ఓడితేనే కదా మరొకరికి గెలుపు దక్కేది. సో గేమ్‌ని గేమ్‌లాగే చూడాలి తప్ప, పర్సనల్‌ ఆరోపణలు చేయడం మంచిది కాదు.

ALSO READ: బిగ్ బాస్ హోస్ట్ నాని పై సంజన సంచలన వ్యాఖ్యలు..!