షార్ట్ ఫిలింస్‌తో పాపులర్ అయిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తొలి సారిగా 'అ' సినిమాతో పెద్ద తెరపై తన ప్రతిభను చూపించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ తనని ఇంప్రెస్ చేయడంతో హీరోగా దూసుకెళ్తోన్న నాని నిర్మాతగా అవతారమెత్తాడు. తొలి షాట్ నుండే ఈ సినిమాతో ఈ యంగ్ డైనమిక్స్ ప్రేక్షకుల మనసుల్ని దోచేశారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటే, అవునంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రశాంత్ దర్శకత్వంలో ఈ సారి నానినే హీరోగా సినిమా చేయనున్నారట. అయితే ఈ సినిమా నాని నిర్మాణంలో ఉండదట. వేరే నిర్మాత ఈ సినిమాని రూపొందించనున్నారట. అలాగే నాని ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడనే ఆశక్తికరమైన సమాచారమ్ కూడా అందుతోంది. అదీ సంగతి.
ఇప్పటికే యంగ్ హీరోస్ అందరిలోనూ నాని సో బిజీ. ఆల్రెడీ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా సెట్స్‌పై ఉంది. తర్వాత ఈ ఉగాదికి నాగ్‌తో క్రేజీ మల్టీ స్టారర్ స్టార్ చేయనున్నాడు నాని. ఇవి కాక, తన బెస్ట్ ఫ్రెండ్, కోస్టార్ అయిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని కూడా తొందర్లోనే పట్టాలెక్కించనున్నాడట నాని.
వీటితో పాటు ఇప్పుడు ప్రశాంత్ వర్మని లైన్‌లో పెట్టేశాడు. నాని దూకుడు అస్సలు తగ్గట్లేదే. సినిమాలు చేయడంలో ఎంత జోరు ప్రదర్శిస్తాడో, హిట్స్ కొట్టడంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తాడు నాని. అదే నానిలో ఉన్న స్పెషాలిటీ. ఈ ఏడాది నాని ఇంకా బోణీ కొట్టలేదు. 'కృష్ణార్జున యుద్ధం'తోనే నాని హిట్స్ యుద్ధానికి సమర శంఖం పూరించనున్నాడు. లాస్ట్ ఇయర్ అంతా వరస హిట్లు కొట్టాడు. ఈ ఇయర్ నాని ఏ స్థాయిలో హిట్స్ జోరు కొనసాగిస్తాడో చూడాలిక.
ALSO READ: కర్తవ్యం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్