ENGLISH

'రంగస్థలం' విషయంలో సుక్కు అస్సలు తగ్గట్లేదు

15 March 2018-08:30 AM

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'రంగస్థలం'. సుకుమార్‌ అంటేనే లెక్కల మాస్టారూ. ఆయన లెక్కలు వేస్తే చాలా పక్కాగా ఉంటాయి అంతే మరి. సినిమా సినిమాకీ వేరియేషన్‌ చూపిస్తూ, ఏదో మ్యాజిక్‌ చేస్తాడు సుకుమార్‌. అందుకే సుకుమార్‌ అంటే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ఎంతో ఇష్టం. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి 'నాన్నకు ప్రేమతో' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన సుకుమార్‌ ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి 'రంగస్థలం'తో హిట్‌ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేశారు. సినిమాకి సంబంధించిన ఒక్కో పోస్టర్‌నీ విడుదల చేస్తూ, ఒక్కో ఆశక్తికరమైన అంశాన్ని రివీల్‌ చేస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు. ఈ వారం రోజులు పోతే, సినిమా ప్రమోషన్స్‌ విషయంలో మరింత క్రియేటివిటీని యూజ్‌ చేసే యోచనలో సుక్కు అండ్‌ టీమ్‌ ఉన్నట్లు సమాచారమ్‌. 

ఏ రకంగా చూసుకున్నా 'రంగస్థలం' నిండా ఎన్నో స్పెషాలిటీస్‌ దాగున్నాయి. కన్ను తెరిచినా, కన్ను మూసినా, టెక్నాలజీతో మన మనుగడ ఎంతగా కనెక్ట్‌ అయిపోయిందో ప్రస్తుత కాలంలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఊహకే అందని నాన్‌ టెక్నాలజీ ప్రపంచంలోకి సుకుమార్‌ తీసుకెళ్లిపోనున్నాడు ఈ 'రంగస్థలం' సినిమా ద్వారా. పోస్టర్స్‌లోని స్టిల్స్‌ ఇప్పటికే ఇరగదీసేస్తున్నాయ్‌. ఇకపోతే ఈ సినిమా కథ ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతోంది అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 

ఎన్ని ప్రచారాలు జరిగినా, సినిమా కథ మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండబోతోందట. ఇదిలా ఉంటే, 'రంగస్థలం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సహా, మెగా కాంపౌండ్‌ హీరోలందరూ వేదికపై కనిపించి సందడి చేయనున్నారనీ సమాచారమ్‌.

ALSO READ: కర్తవ్యం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్