నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ బ్యానర్‌లో రూపొందుతోన్న రెండో సినిమా 'హిట్'. ప్రామిసింగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఆ క్రైమ్‌పై ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్‌గా విశ్వక్సేన్ కనిపిస్తున్నాడు. చాలా మంది పాత్ర ధారులున్నారు. అందర్నీ ఒక్కొక్కరిగా టీజర్‌లో రివీల్ చేశారు. బ్రహ్మాజీ, భానుచందర్, మురళీశర్మ, హరితేజ తదితరులు టీజర్‌లో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపిస్తున్నారు. అందరిలోనూ సీరియస్‌నెస్ ఉంది. విజువల్‌తో పాటు, కట్టిపడేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో టీజర్‌పై అంచనాల్ని పెంచేశారు. హీరోయిన్‌గా రుహానీ శర్మ నటిస్తోంది.
ఓ క్రైమ్ కేస్‌ని సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడుతుంటాయి. వాటిని హీరో ఎలా టేకప్ చేశాడు? ఆ విపత్కర క్రైమ్ కేస్‌ని ఎలా ఛేధించాడు.? అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. మధ్యలో కమర్షియల్ టచ్ కూడా ఇచ్చారు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడిపించారు. ఓ ఘాటు లిప్‌లాక్ కూడా లాగించేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్మాతగా మారిన నాని రూపొందిస్తున్న ఈ రెండో చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలంటే, రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ALSO READ: 'అశ్వథ్థామ'కు ప్రీ రిలీజ్ బజ్ అదిరింది.!