ENGLISH

మాస్‌ అండ్‌ క్లాస్‌ 'బాలకృష్ణుడు'

23 September 2017-13:40 PM

నారా రోహిత్‌ కొత్త సినిమా వస్తుందంటే చాలు కథలో ఏం కొత్తదనం ఉండబోతోందో అనే ఆశక్తి ఉంటుంది ఆడియన్స్‌లో. ఎప్పటికప్పుడే కొత్త కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు నారా రోహిత్‌. ప్రస్తుతం నారా రోహిత్‌ నటిస్తున్న చిత్రం 'బాలకృష్ణుడు'. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతోందట. రోహిత్‌కి జంటగా అందాల తార రెజీనా నటిస్తోంది ఈ సినిమాలో. పవన్‌ మల్లెల డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా న్యూ లుక్‌ లేటెస్టుగా విడుదలైంది. గతంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కీ రెస్పాన్స్‌ అదిరిపోయింది. లేటెస్ట్‌ లుక్‌లో నారా రోహిత్‌ అల్టిమేట్‌గా ఉన్నాడు. చాలా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. కొంచెం బొద్దుగా ఉండే నారా రోహిత్‌ ఈ సినిమా కోసం బాగా స్లిమ్‌ అయ్యాడు. సిక్స్‌ ప్యాక్‌ కూడా ట్రై చేశాడు. ఇంతవరకూ ఫిట్‌నెస్‌ విషయంలో నారా రోహిత్‌ అంతగా కేర్‌ తీసుకోడు. కానీ ఈ సినిమాకి నారా రోహిత్‌ బరువు తగ్గి చాలా ఫిట్‌గా మారిపోయాడు. ఈ లుక్‌లో అస్సలు బీభత్సంగా ఉన్నాడు నారా రోహిత్‌. ఇటీవలే 'కథలో రాజకుమారి' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇదో డిఫరెంట్‌ స్టోరీనే. అఫ్‌కోర్స్‌ నారా రోహిత్‌ సినిమా అంటేనే అంత. మంచి టాక్‌ వచ్చింది ఈ సినిమాకి. అలాగే రాబోతున్న 'బాలకృష్ణుడు' సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. రెజీనా - రోహిత్‌ మధ్య డిఫరెంట్‌గా సాగే లవ్‌స్టోరీ సినిమాకి అదనపు ఆకర్షణ కానుందట.

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్