ENGLISH

నాని మైండ్ బ్లోయింగ్ లైనప్

22 February 2025-16:08 PM

నేచుర‌ల్ స్టార్ నాని పుల్ స్పీడ్ మీదున్నాడు. ఒక వైపు హీరో గా వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ, ఇంకో వైపు నిర్మాతగా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వం లో హిట్ 3 లో నటిస్తున్నాడు. హిట్ 3 కి నిర్మాత కూడా నాని. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల తో చేయనున్న ప్యారడైజ్ షూట్ లో జాయిన్ అవుతున్నాడు.

ప్యారడైజ్ తర్వాత ఓజీ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 2026 లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇంకా కోలీవుడ్ డైరక్టర్ 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తితో కూడా నాని ఒక ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత కొంత  కాలంగా చర్చలు జరుగుతున్నాయని, అవి ఇప్పటికి ఫైనల్ అయ్యి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది కూడా 2026 లోనే స్టార్ట్ కానుంది అని టాక్. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోంది.

వీటి తో పాటు ఇంకా మరికొన్ని చర్చలదశలో ఉన్నాయని, బిజీ షెడ్యూల్ కారణంగా నాని వాటిని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. నాని హీరో గా మరో రెండేళ్లు బిజీ. ఇంకో వైపు నిర్మాతగా కూడా బిజీ గా ఉన్నాడు. తన నిర్మాణ సంస్థలోనే 'కోర్టు' అనే సినిమాని తెరకెక్కించాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. నెక్స్ట్ మెగాస్టార్, శ్రీకాంత్ ఓదెలతో ఒక మూవీ, బాలయ్య తో HIT 4 నిర్మించనున్నాడు నాని.

ALSO READ: జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ & రేటింగ్