ENGLISH

Godfather: గాడ్ ఫాదర్ .. నోట్ తో సరిపెట్టిన నయన్

09 October 2022-12:00 PM

నయనతార సినిమా ప్రమోషన్లలో కనిపించదు. సినిమా సైన్ చేసినప్పుడే ప్రమోషన్స్ కి రానని చాలా క్లియర్ చెప్పేస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్లలలో కూడా సినిమాకి సంబధించి సంగతులు వుండవు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంక ఆ సినిమా గురించి అలోచించదు. తాజాగా గాడ్ ఫాదర్ లో నటించింది. అమెది కీలక పాత్రే. చిరంజీవి సినిమా కావడంతో ఆమె ఏదైనా ఈవెంట్ లేదా ఇంటర్వ్యూ ఇస్తుందని అనుకున్నారంతా కానీ అసలు మీడియా ముందుకు రాలేదు. అయితే తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒక నోట్ షేర్ చేసింది.

 

‘‘గాడ్‌ఫాదర్‌’ కు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘సైరా’ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనొక మంచి వ్యక్తి, గొప్ప నటుడు. సత్యప్రియ వంటి కీలకమైన పాత్రకు నేను ప్రాణం పోయగలనని నమ్మిన మోహన్‌రాజాకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని అంటూ ఒక నోట్ పంచుకుంది నయన్.

ALSO READ: సమంత వెనక్కి తగ్గింది కానీ