ENGLISH

Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌లో పుష్ప హ‌వా!

10 October 2022-11:00 AM

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (2021- సౌత్‌)లో పుష్ప త‌న త‌డాఖా చూపించింది. ఏకంగా స‌గం అవార్డుల్ని ప‌ట్టుకొచ్చేసింది. పుష్ప‌లో.. పుష్ప‌రాజ్ - త‌గ్గేదేలే - అంటూ అల్లు అర్జున్ చూపించిన విశ్వ‌రూపానికి ఉత్త‌మ న‌టుడు అవార్డ్ ద‌క్కింది.

 

ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ‌ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ గాయ‌కుడు, ఉత్త‌మ గాయ‌ని, కెమెరామెన్‌.... ఇలా ప‌లు అవార్డుల్ని పుష్ప సొంతం చేసుకొంది. ఉత్త‌మ న‌టిగా సాయి ప‌ల్ల‌వి (ల‌వ్ స్టోరీ)కి అవార్డు ల‌భించింది. ఉప్పెన‌కు కూడా ప‌లు అవార్డులు ద‌క్కాయి. బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్ తేజ్‌, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతి శెట్టి నిలిచారు.

 

ఉత్త‌మ గీత ర‌చ‌యిత పుర‌స్కారం దివంగ‌త ర‌చ‌యిత‌ సిరివెన్నెలకు ద‌క్కింది. ఇదే వేదిక‌పై నిర్మాత‌ అల్లు అర‌వింద్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ పుర‌స్కారం ద‌క్కింది.

ALSO READ: గాడ్ ఫాదర్ .. నోట్ తో సరిపెట్టిన నయన్