ENGLISH

విజయశాంతి తర్వాత నయనతారేనేమో!

10 March 2018-08:30 AM

ముద్దుగుమ్మ నయనతారకు సౌత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్‌తోనే ఆమె తమిళంలో నటించిన 'ఆరమ్‌' చిత్రాన్ని తెలుగులో 'కర్తవ్యం' పేరుతో విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని బాగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. 

గతంలో లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతి హీరోయిన్‌గా 'కర్తవ్యం' టైటిల్‌తో సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నయనతార నటించిన ఈ సినిమాను 'కర్తవ్యం' టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అప్పుడు 'కర్తవ్యం'లో విజయశాంతి పోలీసు పాత్ర పోషించగా, ఈ సినిమాలో నయనతార కలెక్టర్‌ పాత్రలో నటించింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తేనే, ఆ సినిమాకు బోలెడంత క్రేజ్‌. ఇక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నయన్‌ని చూస్తే, ఆమె అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. సోషల్‌ మెసేజ్‌తో కూడిన చిత్రంగా ఈ 'కర్తవ్యం' తెరకెక్కింది. 

తమిళంలో ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. నయనతార తెలుగులో నటించిన స్ట్రెయిట్‌ సినిమా కాకపోయినా, ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. తెలుగులో సినిమా ప్రమోషన్స్‌కు నయన్‌ హాజరు కాదనే బ్యాడ్‌ నేమ్‌ ఉన్నప్పటికీ, ఆమెకు తెలుగులో ఈ స్థాయిలో క్రేజ్‌ ఏంటో అస్సలు అర్ధం కాదు. ఏవైనా బిగ్‌ ప్రాజెక్ట్స్‌ తెరకెక్కుతున్నాయంటే, హీరోయిన్‌గా ముందు ప్లేస్‌లో నయన్‌ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంత ఇమేజ్‌ని సంపాదించుకుంది నయనతార తెలుగులో. 

ప్రస్తుతం తెలుగులో ప్రెస్టీజియస్‌ అండ్‌ భారీ బడ్జెట్‌ మూవీ అయిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ: తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా